నాలుగు పట్టణాల నుండి ఏపీకి ఆక్సిజన్: జగన్ సర్కార్ ప్లాన్

By narsimha lode  |  First Published Apr 21, 2021, 1:41 PM IST

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రానికి అవసరమైన  ఆక్సిజన్ ‌ను నాలుగు ప్రాంతాల నుండి తీసుకొచ్చేందుకు  ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.
 


అమరావతి: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రానికి అవసరమైన  ఆక్సిజన్ ‌ను నాలుగు ప్రాంతాల నుండి తీసుకొచ్చేందుకు  ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో  ఆక్సిజన్ కొరత దేశంలోని పలు ఆసుపత్రులను వేధిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కూడ ఆక్సిజన్  కొరత తీవ్రంగా ఉంది. దీంతో రైల్వే వ్యాగన్ల ద్వారా పలు రాష్ట్రాలకు  ఆక్సిజన్  సరఫరాను రైల్వే శాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఏపీ ప్రభుత్వం కూడ తమ రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందనే విషయమై అంచనాలు తయారు చేస్తోంది.  ప్రతి రోజూ 80 నుండి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమని  అధికారులు చెబుతున్నారు. బాగా ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో రోజుకు 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని  అధికారులు అంచనాకు వచ్చారు. 

Latest Videos

అయితే ఈ ఆక్సిజన్ ను నాలుగు ప్రాంతాల నుండి  తెప్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది.  విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు  భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుండి ఆక్సిజన్ ఏపీకి తెప్పించుకొనేలా  ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ను ముందే స్టోర్ చేసుకోవాలని  ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

click me!