విరాళాలపై వెబ్‌సైట్లో సమాచారం: టీటీడీ పాలకమండలిలో చర్చ

By narsimha lodeFirst Published May 28, 2020, 11:19 AM IST
Highlights

కీలక విషయాలపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది. టీటీడికి భక్తుల నుండి వచ్చిన విరాళాలపై కూడ సమగ్ర సమాచారంపై వెబ్ సైట్‌లో పొందుపర్చాలని టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి సూచనపై టేబుల్ ఎజెండాగా చర్చ జరుగుతోంది.
 


హైదరాబాద్: కీలక విషయాలపై చర్చించేందుకు టీటీడీ పాలకమండలి సమావేశం గురువారం నాడు ప్రారంభమైంది. టీటీడికి భక్తుల నుండి వచ్చిన విరాళాలపై కూడ సమగ్ర సమాచారంపై వెబ్ సైట్‌లో పొందుపర్చాలని టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి సూచనపై టేబుల్ ఎజెండాగా చర్చ జరుగుతోంది.

గురువారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా వీడియో కాన్పరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుమల,హైద్రాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నుండి పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఏ రోజున ఏ భక్తుడు టీటీడీకి  ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారనే  విషయాన్ని సమగ్రంగా వెబ్‌సైట్ లో పొందుపర్చాలని శేఖర్ రెడ్డి కోరారు. ఈ విషయమై బోర్డు చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు.

also read:పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

మరో వైపు టీటీడీ ఆస్తుల విక్రయానికి సంబంధించి కూడ టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ తర్వాత భక్తులకు స్వామి దర్శనం విషయమై కూడ స్పష్టత రానుంది. లాక్ డౌన్ తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి సంబంధించి ఏ రకంగా అనుమతులు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కూడ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవాళ్టి సమావేశంలో సుమారు 92 అంశాలపై పాలకమండలిలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. టీటీడీ పాలకమండలి నిర్ణయాలను సాయంత్రం చైర్మెన్ సుబ్బారెడ్డి మీడియాకు వివరించే అవకాశం ఉంది.

click me!