నవ వధువును పదిలి పారిపోయిన వరుడు: అతనో టెక్కీ, ప్రేమ వ్యవహారమే

Published : May 28, 2020, 09:00 AM IST
నవ వధువును పదిలి పారిపోయిన వరుడు: అతనో టెక్కీ, ప్రేమ వ్యవహారమే

సారాంశం

పెళ్లయిన నాలుగు రోజులకే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు వధువును వదిలేసి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో విచిత్రమైన సంఘటన జరిగింది. నవ వధువును వదిలి వరుడు పారిపోయాడు. కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో ఈ సంఘటన జరిగింది.

కోయిలకుంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరకుమార్ వివాహమైన నాలుగు రోజులకే నవ వధువును వదిలి ఇంట్లోంచి పారిపోయాడు. దీంతో వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. 

వరుడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రేమ వ్యవహారమే అతను పారిపోవడానికి కారణమని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. కోయిలకుంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు