శ్రీవారికి తోమాల కాదు థామస్ సేవట... సోషల్ మీడియాలో కుట్రలు, టిటిడి సీరియస్

By Arun Kumar PFirst Published Jul 15, 2021, 10:52 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాతో దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించననున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ హెచ్చరించింది. 

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లోని సమాచారాన్ని మార్పింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని... అంటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు హెచ్చరించారు. 

తిరుమల వెంకటేశ్వర స్వామికి చేసే తోమాల సేవను టిటిడి వెబ్ సైట్ లో తోమస్ సేవగా పేర్కొందంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిటిడి మండిపడింది. ఇలా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించే కుట్రలను టీటీడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. తోమాల సేవను తోమాస్ సేవగా మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టిటిడి ప్రకటించింది. 

read more  వాలంటీర్లతో అన్యమత ప్రచారం... ఆ మతంలో చేరితేనే ప్రభుత్వ పథకాలట: బోండా ఉమ

గతంలో తిరుమలకు భక్తులు వెళ్లే ఆర్టీసి బస్సల్లో టిక్కెట్ల అన్యమత ప్రచార ఘటన బయటపడిన విషయం తెలిసిందే. బస్సు టిక్కెట్ల వెనుక భాగంలో  అన్యమత ప్రచారానికి సంబంధించిన యాడ్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని తిరుమలకు వచ్చిన భక్తులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తిరుమలకు వెళ్లే బస్సులో ఆర్టీసీ  ఇచ్చిన టిక్కెట్లపై ఈ యాడ్స్ ఉండడంపై భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.

ఈ ఘటనపై తిరుపతిలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుమారు ఐదు టిక్కెట్ రోల్స్ వచ్చినట్టుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు

అన్యమత ప్రచారం యాడ్స్ ఉన్న టిక్కెట్టు రోల్స్ ను ఆర్టీసీ వెనక్కి తెప్పించింది. నెల్లూరు డిపో నుండి ఐదు రోల్స్ తిరుపతికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందుకు కారణమైన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొన్నారు.
 

click me!