సముద్రంలోకి దూసుకెళ్లిన కారు: చివరికిలా...

Published : Jul 15, 2021, 10:18 AM ISTUpdated : Jul 15, 2021, 10:23 AM IST
సముద్రంలోకి దూసుకెళ్లిన కారు: చివరికిలా...

సారాంశం

మద్యం మత్తులో కారును సముద్రంలోకి నడిపాడు ఓ యువకుడు.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహయంతో కారును బయటకు తీశారు. కాకినాడ బీచ్ రోడ్డులో మద్యం మత్తులో యువకుడు కారును సముద్రంలోకి తీసుకెళ్లాడు.  కారును సకాలంలో బయటకు తీయడంతో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. 

కాకినాడ: కాకినాడ బీచ్‌ రోడ్డులో తృటిలో ప్రమాదం తప్పింది. ఆరుగురు యువకులు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.కాకినాడ బీచ్ రోడ్డులో ఆరుగురు యువకులు కారులో చక్కర్లు కొట్టారు. మద్యం మత్తులో యువకులు కారును నడిపారు.కారు అదుపు తప్పి సముద్రంలోకి వెళ్లింది. 

అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారును ట్రాక్టర్ సహాయంతో  బయటకు తీశారు. కారులోని ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు.మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే సముద్రంలోకి కారు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్