తండ్రి కాదు కీచకుడు.. 15యేళ్ల కూతురిపై పలుమార్లు అత్యాచారం, గర్భిణి..!

Published : Jul 15, 2021, 10:21 AM IST
తండ్రి కాదు కీచకుడు.. 15యేళ్ల కూతురిపై పలుమార్లు అత్యాచారం, గర్భిణి..!

సారాంశం

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కుమార్తెను చెరబట్టాడు. బాలికపై (15)  పలుమార్లు అత్యాచారం చేసి.. ఐదు నెలల గర్భిణీని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ప్రకాశం : తండ్రులే మృగాళ్లుగా మారుతున్నారు. కన్నపిల్లల్ని పొట్టనపెట్టుకునే పులుల కంటే దారుణంగా కూతుర్లను వేటాడుతున్నారు. అత్యంతనీచంగా చెరబట్టి, అత్యాచారాలు చేస్తూ.. సొంత కూతుర్లనే గర్భవతులుగా చేస్తున్నారు. ఇలాంటి అమానవీయ.. అత్యంత హేయమైన సంఘటన ప్రకాశం జిల్లలో చోటు చేసుకుంది. 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కుమార్తెను చెరబట్టాడు. బాలికపై (15)  పలుమార్లు అత్యాచారం చేసి.. ఐదు నెలల గర్భిణీని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా నివసిస్తున్నాడు. 

జనవరి నెలలో బాలిక తల్లి సరుకులు తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లికి వెళ్ళింది.  ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా అత్యాచారం చేశాడు.  ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.  

ఈ క్రమంలో బాలికను తరచూ కొడుతుండడంతో సుమారు 20 రోజుల కిందట బాలిక 100 నెంబర్కు ఫోన్ చేసింది. అప్పుడు పోలీసులు వెళ్లి మందలించారు.  ఆ తర్వాత బాలిక అవ్వ,తాతల ఇంటికి వెళ్ళింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu