భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్: రేపటి నుండి సర్వదర్శనం టోకెన్ల జారీ

By narsimha lodeFirst Published Oct 25, 2020, 5:18 PM IST
Highlights

తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు టోకెన్లను ఈ నెల 26వ  తేదీ నుండి జారీ చేయనున్నారు.ప్రతి రోజూ 3 వేల మందికి టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందజేస్తారు.


తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు టోకెన్లను ఈ నెల 26వ  తేదీ నుండి జారీ చేయనున్నారు.ప్రతి రోజూ 3 వేల మందికి టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందజేస్తారు.

శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకొనేందుకు వీలుంటుంది.
దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అలిపిరి పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు.

also read:రేపటి నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం: టీటీడీ గ్రీన్ సిగ్నల్

రెండు మాసాల తర్వాత సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుండి 3 వేల కోటాను రూ. 300 ప్రత్యేక దర్శనానికి మళ్లించింది.

వీటితో పాటు వీఐపీలకు బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టుకు రూ. 10 వేలు విరాళాన్ని ఇచ్చిన భక్తులకు, బోర్డు సభ్యుల సిఫారసులపై జారీ చేసే రూ. 300 సుపథం ప్రవేశం, వెయ్యి రూపాయాలతో జారీ చేసే ఆన్ లైన్ కళ్యాణోత్సవం టిక్కెట్లు కొన్నవారికి ప్రస్తుతం దర్శనం చేయిస్తున్న విషయం తెలిసిందే.

తిరుమల, తిరుపతిలో కరోనా కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. 
 

click me!