ఏపీలో కొత్తగా 2,997 మందికి పాజిటివ్: 8 లక్షల 7 వేలకి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Oct 25, 2020, 04:43 PM IST
ఏపీలో కొత్తగా 2,997 మందికి పాజిటివ్: 8 లక్షల 7 వేలకి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 67,419 శాంపిల్స్‌ను పరీక్షించడంతో 2,997 మంది కరోనా బారినపడ్డట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 67,419 శాంపిల్స్‌ను పరీక్షించడంతో 2,997 మంది కరోనా బారినపడ్డట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి చేరింది.

నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,587కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 30,680 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,585 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,69,576కి చేరుకుంది.

నిన్న నిర్వహించిన పరీక్షలతో కలిపి టెస్టుల సంఖ్య 75,70,352కి చేరింది. గత 24 గంటల్లో అనంతపురం 108, చిత్తూరు 456, తూర్పుగోదావరి 254, గుంటూరు 301, కడప 153, కృష్ణ 358, కర్నూలు 67, నెల్లూరు 96, ప్రకాశం 340, శ్రీకాకుళం 86, విశాఖపట్నం 187, విజయనగరం 89, పశ్చిమ గోదావరిలలో 492 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు 5, కడప 3, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నంలలో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?