చంద్రబాబు బంధువులు అయితే భూములు వదిలేయాలా?: గీతం భూములపై బొత్స

By narsimha lodeFirst Published Oct 25, 2020, 4:15 PM IST
Highlights

ఆక్రమించుకొన్న భూములను గీతం యూనివర్శిటీ వెనక్కి ఇస్తే బాగుండేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.


విశాఖపట్టణం: ఆక్రమించుకొన్న భూములను గీతం యూనివర్శిటీ వెనక్కి ఇస్తే బాగుండేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు  బంధువులు అయినంత మాత్రాన భూములు వదిలేయాలా అని ఆయన ప్రశ్నించారు.

also read:జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ: గీతం కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు

ఎవరిపైనా కక్ష సాధింపు చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. గీతం భూముల వ్యవహరంలో చట్టం తన పని తాను చేసుకొనిపోతోందని ఆయన చెప్పారు.ఆరు నెలల నుండి గీతం భూముల వ్యవహరం నెలకొందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గీతం యూనివర్శిటీ  అక్రమ కట్టడాలను శనివారం నాడు రెవిన్యూ అధికారులు తొలగించారు.ఈ విషయమై గీతం యూనివర్శిటీ యాజామాన్యం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సోమవారం వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వానికి చెందిన 40 స్థలాలను గీతం యూనివర్శిటీ ఆక్రమించుకొందని రెవిన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. 

click me!