కోరలు చాస్తోన్న కరోనా: ధన్వంతరి యాగం చేయనున్న టీటీడీ

By Siva KodatiFirst Published Mar 20, 2020, 4:46 PM IST
Highlights

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులను మాత్రమే అనుమతించనున్నారు.

కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో ధన్వంతరి యాగం చేయాలని టీటీడీ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగే ఈ యాగానికి పూజారులు, పీఠాధిపతులను మాత్రమే అనుమతించనున్నారు. లోక కళ్యాణం కోసం ఈ ధన్వంతరి యాగం చేస్తున్నామని టీటీడీ ప్రకటించింది.

ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ధన్వంతరి యాగం నిర్వహించనున్నారు. అయితే అంతకుముందుగానే తొమ్మిది రోజుల పాటు ఆరోగ్య జపాన్ని చేయాలని అధికారులు నిర్ణయించారు.

Also Read:

తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన రుత్విక్కులను రప్పించి, నాలుగు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో ఈ జపాన్ని కొనసాగిస్తారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించిన రుత్విక్కులు ఆరోగ్య జపాన్ని ఈ నెల 25 వరకు కొనసాగించనున్నారు.

26వ తేదీన తిరుమల ధర్మగిరి వద్ద వున్న వేద పాఠశాలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, మంత్రాలయం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

ఆలయం మూసివేయడం లేదు.. భక్తుల ప్రవేశమే నిలిపివేత: టీటీడీ ఈవో

ధన్వంతరి యాగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సుఖశాంతి, ఆరోగ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. గతంలోనూ విపత్తుల సమయంలోనూ టీటీడీ ఇలాంటి యాగాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 

click me!