నిత్యావసరాల రేట్లు పెంచితే కఠిన చర్యలు: వ్యాపారులకు జగన్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Mar 20, 2020, 3:52 PM IST
Highlights

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... వైరస్ వ్యాప్తి, నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్, ప్రార్థనా మందిరాలు మూసివేత కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్ధితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని జగన్ తెలిపారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేసిన జగన్

నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. కరోనా పేరు చెప్పి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని, బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా..? లేదా..? అనేది చూడాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో పారాసిటమాల్ ఇతర యాంటిబయాటిక్స్ సిద్ధంగా ఉంచుకోవాలని జగన్ ఆదేశించారు.

Also Read:ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

వైద్య ఆరోగ్య సిబ్బందిని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవాలని.. పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో ఖచ్చితంగా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. 

click me!