అమల్లోకి ఆదేశాలు, భక్తుల ప్రవేశం నిలిపివేత: తిరుమల గిరుల్లో కర్ఫ్యూ వాతావరణం

By Siva KodatiFirst Published Mar 20, 2020, 4:22 PM IST
Highlights

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని శుక్రవారం టీటీడీ నిలిపివేసింది. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఇప్పటిదాకా ఉన్ భక్తులకు స్వామి వారి దర్శనం చేయించి కిందకు పంపేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని శుక్రవారం టీటీడీ నిలిపివేసింది. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఇప్పటిదాకా ఉన్ భక్తులకు స్వామి వారి దర్శనం చేయించి కిందకు పంపేశారు.

కొత్తగా భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించడం లేదు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు రెండు ఘాట్ రోడ్లను అధికారులు మూసివేశారు. దీంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల గిరుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. 

Also Read:ఆలయం మూసివేయడం లేదు.. భక్తుల ప్రవేశమే నిలిపివేత: టీటీడీ ఈవో

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని, భక్తుల ప్రవేశాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. 

టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని, ప్రస్తుతానికి మాత్రం వారం పాటు ఆంక్షలు ఉంటాయని ఈవో స్పష్టం చేశారు.

Also Read:శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సింఘాలు ప్రకటించారు. ఒంటిమిట్టలోని శ్రీరామ ఆలయంలో కల్యాణం ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.

టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను నిన్నటి నుంచే మూసివేశామని ఈవో తెలిపారు. 

click me!