తిరుమలలో దళారీల ప్రమేయానికి అడ్డుకట్ట: సిఫారసు లేఖలపై టీటీడీ విచారణ

By narsimha lode  |  First Published Apr 21, 2023, 5:21 PM IST

 తిరుమల వెంకన్న దర్శనానికి   ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసుల   లేఖల దుర్వినియోగంపై    టీటీడీ కేంద్రీకరించింది.  ఈ విషయమై  విచారిస్తుంది


తిరుమల: వెంకటేశ్వరస్వామి దర్శనం విషయంలో  దళారుల ప్రమేయాన్ని  నివారించాలని టీటీడీ ప్రయత్నిస్తుంది. తిరుమల వెంకటేశ్వసర్వామిని ధర్శించుకొనేందుకు  వచ్చే  భక్తులకు  ప్రజా ప్రతినిధులు జారీ చేసే సిఫారసులు లేఖలు దుర్వినియోగం  అవుతున్నాయని  టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.  ఇవాళ  ఉభయగోదావరి జిల్లాల  టీచర్స్ ఎమ్మెల్సీ  షేక్ షాబ్జీ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు  ఫిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదుపై   పోలీసులు  షాబ్జీపై  కేసు నమోదు  చేశారు.  

;దర్శనం కోసం  సిఫారసు చేసే ప్రజా ప్రతినిధుల వివరాలను  టీటీడీ సేకరించింది. 16 మంది ప్రజా ప్రతినిధులు  తరచుగా  సిఫారసు లేఖలను  ఇచ్చారని టీటీడీ గుర్తించింది.  ఈ ప్రజా ప్రతినిధుల నుండి  సమాచారం సేకరిస్తుంది  టీటీడీ.ప్రజాప్రతినిధుల  సిఫారసుల లేఖలపై   టీటీడీ  మార్గదర్శకాలు కూడా ఉన్నాయి.   

Latest Videos

undefined

తిరుమలలో  దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు   టీటీడీ ఎప్పటికప్పుుడు  చర్యలు తీసుకుంటుంది.   అయినా  కూడా ఏదో ఒక రూపంలో   భక్తులకు  దళారులు  టోపీ పెడుతున్నారు.  దళారులు విక్రయించే టిక్కెట్లు తీసుకొని మోసపోయిన భక్తుల ఉదంతాలు కూడా గతంలో  చోటు  చేసుకున్నాయి.  ఏదో అంశం వెలుగు చూసిన  సమయంలో  టీటీడీ అధికారులు  ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.  

also read:టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు:ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షాబ్జీపై కేసు

 పర్వదినాల రోజుల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు పెద్ద ఎత్తున  తమ అనుచరులు, కుటుంబసభ్యులతో  దర్శనాలు చేసుకున్న ఘటనలు కూడా గతంలో  చోటు  చేసుకున్నాయి. 
 

tags
click me!