వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి మూడో రోజు ముగిసింది
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల మూడో రోజు విచారణ శుక్రవారం నాడు ముగిసింది. సీబీఐ ఆఫీస్ నుండి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిద్దరిని ఆరు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది కోర్టు. ప్రతి రోజూ చంచల్ గూడ జైలు నుండి వీరిద్దరిని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.
ఈ నెల 14న ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన రెండు రోజులకే ఈ నెల 16న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజులుగా వీరిని సీబీఐ విచారిస్తుంది.వీరిద్దరితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ ముగ్గురిని వేర్వేరుగా కలిపి విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
undefined
ఇవాళ కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రేపటి విచారణ విషయమై సీబీఐ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ రాత్రికి ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా సీబీఐ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అనుమానిస్తుంది. ఈ మేరకు ఆధారాలు కూడా సేకరించామని సీబీఐ చెబుతుంది. వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది ఈ విషయాలను తెలంగాణ హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
also read:వివేకా కేసు.. ముగిసిన అవినాష్ రెడ్డి మూడో రోజు సీబీఐ విచారణ, రేపు ఏం జరగబోతోందో..?
2019 మార్చి 14న పులివెందుల లలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ని దుండగులు హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తును ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు దర్యాప్తును పూర్తి చేయనుంది.