తిరుమల ఘాట్ రోడ్డు: 12 ఏళ్లు దాటిన వాహనాలకు నో ఎంట్రీ

By narsimha lode  |  First Published May 30, 2023, 1:47 PM IST

12  ఏళ్లు దాటిన  వాహనాలను  తిరుమల ఘాట్  రోడ్డుపైకి అనుమతించవద్దని  టీటీడీ  నిర్ణయం  తీసుకుంది. 



హైదరాబాద్: 12  ఏళ్లు దాటిన  వాహనాలను  తిరుమల  ఘాట్  రోడ్డుపైకి   అనుమతించకూడదని  టీటీడీ  నిర్ణయించింది.  తిరుమల ఘాట్  రోడ్డులో   రోడ్డు  ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు గాను   టీటీడీ  నిర్ణయం తీసుకుంది. 

గత వారం రోజుల  వ్యవధిలో  రెండు ప్రమాదాలు  జరిగాయి. ఈ నెల  24న  28వ  మలుపు వద్ద  ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఆరుగురు  ప్రయాణీకులు గాయపడ్డారు.  ఈ ఈ నెల  29న  తిరుమల ఘాట్  రోడ్డు ఆరో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  15 మంది కర్ణాటక  రాష్ట్రానికి చెందిన భక్తులు గాయపడ్డారు. 

Latest Videos

undefined

తిరుమల ఘాట్  రోడ్డులో  వరుస ప్రమాదాలకు  చెక్ పెట్టేందుకు  టీటీడీ  నిర్ణయం తీసుకుంది. ఘాట్  రోడ్డులో వాహనాల  పర్యవేక్షణకు  పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు,  విభాగాలతో  ప్రత్యేక టీమ్ లు   ఏర్పాటు  చేసింది  టీటీడీ.మరో వైపు 12  ఏళ్లకు పైబడిన  వాహనాలను  తిరుమల ఘాట్  రోడ్డులో  వాహనాలకు అనుమతి  ఇవ్వకూడదని  టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

also read:తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం: ఆరుగురికి గాయాలు

సెల్  ఫోన్ డ్రైవింగ్ , వేగంగా  వాహనాలు నడపడం,   నిద్రలేమి , ఫిట్ నెస్ లేని వాహనాలతో  ప్రమాదాలు  జరిగే  అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.   ఘాట్  రోడ్డులో  ఫిట్ నెస్ లేని వాహనాలు  ప్రమాదాలకు  కారణంగా మారుతన్నాయని  అధికారులు  చెబుతున్నారు.  దీంతో  12  ఏళ్లు దాటిన  వాహనాలను  తిరుమల ఘాట్  రోడ్డుపైకి అనుమతి ఇవ్వకూడదని   టీటీడీ  నిర్ణయం తీసుకుంది. 

tags
click me!