విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం... తండ్రికొడుకుపై రాళ్లదాడి

Published : May 30, 2023, 01:42 PM IST
విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం... తండ్రికొడుకుపై రాళ్లదాడి

సారాంశం

గంజాయి మత్తులో తూగుతున్న యువకులు తండ్రీకొడుకుపై అతి దారుణంగా రాళ్ళదాడికి దిగిన అమానుష ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. గంజాయి మత్తులో అసలేం చేస్తున్నారో కూడా తెలియకుండానే కొందరు యువకులు నేరగాళ్ళుగా మారిపోతున్నారు. అంతేకాదు అకారణంగా ఇతరులపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తున్నారు. ఇలా గంజాయి బ్యాచ్ రాళ్లదాడిలో తండ్రీకొడుకు తీవ్రంగా గాయపడ్డ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ పట్టణంలోని పాయకాపురం శాంతినగర్ లో దుర్గాప్రసాద్(41) భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. అతడి చిన్నకొడుకు ప్రణీత్ రాజ్(13) నిన్న(సోమవారం) రాత్రి తల్లిదండ్రులపై అలిగి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. దీంతో ఆ బాలున్ని వెతుకడానికి పెద్దకొడుకు అమిత్ రాజ్ తో కలిసి దుర్గాప్రసాద్ బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే తన కొడుకు ఏమయినా కనిపించాడేమోనని బయట కనిపించిన శంకర్, వాసు, కిషన్, పండు లను అడిగాడు. 

కొడుకు కనిపించక బాధలో వున్న దుర్గాప్రసాద్ తో గంజాయి మత్తులో వున్న యువకులు గొడవ పెట్టుకున్నారు. గంజాయి మత్తులో వున్న యువకులు దుర్గాప్రసాద్ తో పాటు పెద్దకొడుకు అమిత్ పై రాళ్లదాడికి దిగారు. దీంతో తండ్రికొడుకుల తల పగిలి, ఇతర శరీర భాగాల్లో గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడిపోయిన దుర్గాప్రసాద్ ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొడుకు అమిత్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. 

Read More  మంగళగిరిలో రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి: నిందితుడు అరెస్ట్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడి నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాళ్ళదాడికి దిగి తండ్రికొడుకులను గాయపర్చిన గంజాయి బ్యాచ్ కోసం గాలిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్