అమల్లోకి ఎన్నికల కోడ్.. రికమండేషన్ లెటర్లను రద్దు చేసిన టీటీడీ

By Sairam IndurFirst Published Mar 16, 2024, 9:28 PM IST
Highlights

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రతినిధులు గౌరవించాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. 

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను నేడు ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించరాదని నిర్ణయించింది.

కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు..

అయితే కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం స్వయంగా వచ్చే ప్రముఖులకు శ్రీవారి దర్శనం, వసతిని పరిగణనలోకి తీసుకోనున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు, వీఐపీలు ఈ నిర్ణయాన్ని గమనించి యాజమాన్యానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్

ఇదిలా ఉండగా.. 2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు జూన్ 16 డెడ్లైన్ కంటే ముందే జూన్ 4న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయం.. బీఎస్పీకి రాజీనామా

ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశంలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు చేపట్టాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. ఈ సారి దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందులో 1.08 కోట్ల మంది కొత్త ఓటర్లను ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పని చేయనున్నారు. 

click me!