Andhra Pradesh: రేపు సెలవు ప్రకటించిన జగన్ ప్రభుత్వం

Published : Oct 18, 2021, 02:10 PM IST
Andhra Pradesh: రేపు సెలవు ప్రకటించిన జగన్ ప్రభుత్వం

సారాంశం

మిలాద్ ఉన్ నబీ సెలవును బుధవారానికి బదులు మంగళవారమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సీఈవో సూచన మేరకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు సెలవు అమలుకానుంది.

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సెలవు ప్రకటించింది. మిలాద్ ఉన్ నబీ సెలవు బుధవారం ఉన్నది. కానీ, ఈ సెలవును బుధవారానికి బదులు మంగళవారానికి బదిలీ చేస్తూ నిర్ణయం Andhra Pradesh ప్రభుత్వం తీసుకుంది. ఏపీ స్టేట్ wakf board ఈ మేరకు అభ్యర్థించినట్టు తెలిసింది. Milad Un Nabi పండుగ కోసం బుధవారానికి బదులు మంగళవారం holiday ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి అందింది. దీనిపై సత్వరమే స్పందించిన ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ సెలవును మంగళవారానికి మార్చింది. మంగళవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: సచివాలయ ఉద్యోగులకు జగన్ దసరా కానుక.. ఆ సదుపాయం కల్పించేందుకు అంగీకారం

మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సమాజం మిలాద్ ఉన్ నబీ పండుగగా నిర్వహించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రవక్త జన్మదినాన్ని వేడుక చేసుకుంటాయి. ఇస్లాం క్యాలెండర్‌లో మూడో నెల రబీ అల్ అవ్వల్‌లో పౌర్ణమికి ముందు రోజు మహ్మద్ ప్రవక్త జన్మించినట్టు చరిత్ర చెబుతున్నది. ఆయన జయంతి వేడుకలను అరబ్బీలో మిలాద్ ఉన్ నబీ అంటారు. ఇదే పేరుతో ప్రవక్త జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటారు. మనదేశంలోనూ ముస్లింలు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండుగ చేసుకుంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్