ప్రమాదంలో ఉక్కు పరిశ్రమ ఉనికి... .ఆంధ్రుడా మేలుకో: హీరో నారా రోహిత్

By Arun Kumar PFirst Published Feb 21, 2021, 2:05 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సోషల్ మీడియా వేదికన ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు హీరో నారా రోహిత్.  

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాస్త ఘాటుగా స్పందించారు టాలీవుడ్ హీరో నారా రోహిత్. విశాఖ ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడిని ఉక్కు పరిశ్రమ రాష్ట్ర ప్రజలందరి ఆత్మాభిమానానికి సూచిక అని... అలాంటి పరిశ్రమ ప్రమాదపు అంచుల్లో వుంటూ చూస్తూ ఊరుకోవద్దని రోహిత్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సోషల్ మీడియా వేదికన ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు నారా రోహిత్.  

''కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు.  త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు.  ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు.  64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోంది..ఆంధ్రుడా మేలుకో'' అంటూ నారా రోహిత్ పిలుపునిచ్చారు. 

 read more  స్టీల్ ప్లాంట్ రగడ: రంగంలోకి చంద్రబాబు, ప్రైవేటీకరణ వద్దంటూ మోడీకి లేఖ

'' 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది.  సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో  పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం'' అంటూ  నారా రోహిత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సూచించారు.

click me!