నా రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
విశాఖపట్టణం: నా రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు.
ఆదివారం నాడు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆయన స్పందించారు.స్టీల్ ప్లాంట్ పై బీజేపీ కొత్త పల్లవి అందుకొందని ఆయన విమర్శించారు. నిర్దోషికి ఉరి తాడు బిగించి ఇంకా శిక్ష అమలు కాలేదన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.
undefined
also read:గంటా శ్రీనివాసరావుతో పీసీసీ చీఫ్ శైలజనాథ్ భేటీ: ఏం జరుగుతోంది ?
ఎందుకు రాద్దాంతం అన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి వెల్లడించారని ఆయన ప్రస్తావించారు.
ప్రైవేటీకరణను అడ్డుకొంటామని బీజేపీ నేతలు ఎందుకు అనడం లేదో చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంంట్ ను కాపాడడంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న వపన్ కు బాధ్యత, హక్కు ఉందని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పవన్ కళ్యాణ్ పోరాటం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ ప్రముఖులు కూడ సోషలో మీడియా వేదికగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.