ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స

By narsimha lode  |  First Published Jan 30, 2023, 7:27 PM IST

సినీ నటుడు తారకరత్న ఆరోగ్యం మరింత విషమంగానే ఉందని  నారాయణ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్  ద్వారా  చికిత్స అందిస్తున్నట్టుగా  వైద్యులు తెలిపారు.
 



బెంగుళూరు:  తీవ్ర అస్వస్థకు గురైన నందమూరి  తారకరత్నకు  వెంటిలేటర్ సపోర్టుతో  చికిత్స అందిస్తున్నట్టుగా  నారాయణ ఆసుపత్రి వైద్యులు  ప్రకటించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై  నారాయణ ఆసుపత్రి వైద్యులు   సోమవారం నాడు రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న  ఆరోగ్యం ఇంకా విషమంగానే  ఉందని  డాక్టర్లు తెలిపారు. తారకరత్నకు  ఎక్మో  సపోర్టు ఇవ్వడం లేదని  డాక్టర్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ఎఫ్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్టుగా  హెల్త్ బులెటిన్ లో  డాక్టర్లు వివరించారు.  ఈ నెల  27వ తేదీన   కుప్పంలో  లోకేష్ పాదయాత్రకు  తారకరత్నకు  వచ్చారు. లోకేష్ తో కలిసి  తారకరత్న కొద్దిసేపు నడిచారు.  అనంతరం   తారకరత్న  కుప్పకూలిపోయాడు.  

కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో తొలుత  ప్రాథమిక చికత్స చేశారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. పీఈఎస్ మెడికల్ కాలేజీలో  చికిత్స  తర్వాత  అదే  రోజు  రాత్రి గ్రీన్ చానెల్ ద్వారా బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. బెంగుళూరులోని నారాయణ  ఆసుపత్రికి  తరలించారు.  ఈ నెల  27వ తేదీ నుండి  అదే ఆసుపత్రిలో  తారకరత్నకు  చికిత్స అందిస్తున్నారు.   చికిత్సకు  తారకరత్న  స్పందిస్తున్నారని  నిన్న బాలకృష్ణ ప్రకటించారు.  తారకరత్న ఆరోగ్యం నిలకడగా  ఉందని  నందమూరి  రామకృష్ణ ఇవాళ ప్రకటించారు.  నందమూరి  తారకరత్న భార్య సహ  ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.  తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను   నిపుణులైన డాక్టర్లను కూడా  ఆసుపత్రికి రప్పించారు. 

Latest Videos

undefined

 తారకరత్నకు  మెలెనా అనే వ్యాధి సోకిందని  వైద్యులు గుర్తించారు.  దీని కారణంగా  తీవ్రమైన ఆయాసంతో  కుప్పకూలిపోతుంటారని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి కారణంగా  తారకరత్నకు  అంతర్గత అవయవాల్లో  రక్తస్రావం అవుతుందని  సమాచారం.  బ్లీడింగ్ ను కంట్రోల్ చేసేందుకు  వైద్యులు  ప్రయత్నాలు  చేస్తున్నారు. 

 తారకరత్నకు వెంటిలేటర్  సపోర్టుతో  చికిత్స అందిస్తున్నట్టుగా  వైద్యులు వివరించారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా  విషమంగానే  ఉందని  కూడా వైద్యులు ప్రకటించారు.   తారకరత్న కోలుకుంటారని  నందమూరి కుటుంబ సభ్యులు  ఆశాభావం వ్యక్తం  చేస్తున్నారు

also read:తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ఎక్మో అసలు పెట్టలేదు: నందమూరి రామకృష్ణ

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు  నిన్న  తారకరత్నను పరామర్శించారు.  కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్  నిన్న నారాయణ ఆసుపత్రికి వచ్చారు.  తారకరత్న ఆరోగ్యపరిస్థితి గురించి మంత్రి సుధాకర్ ఆరా తీశారు.  ఇతర ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నిపుణులైన వైద్యులను కూడా ఇక్కడికే రప్పించి చికిత్స అందించేలా  మంత్రి ఆదేశించారు. 

click me!