ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణీస్తున్న విమానం 24 గంటల పాటు గాల్లో ప్రయాణించింది. 24 నిమిషాల తర్వాత విమానంలో సాంకేతిక లోపాలన్ని పైలెట్ గుర్తించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణీస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన 24 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. అత్యవసరంగా తాము ల్యాండ్ అవుతామని సీఎం ప్రయాణీస్తున్న విమాన పైలెట్ గన్నవరం విమానాశ్రయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విమానం ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.
also read:సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..
undefined
రేపు ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం 5:03 గంటలకు బయలుదేరారు. అయితే సాయంత్రం 5:27 గంటలకు పైలెట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపు సీఎం వీఐపీ లాంజ్ లో ఉన్నారు. అనంతరం సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరకున్నారు.సీఎం జగన్ సురక్షితంగా తాడేపల్లి కార్యాలయానికి చేరుకున్నారని సీఎంఓ ప్రకటించింది. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ ప్రయాణీస్తున్న విమానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.
సీఎం ప్రయాణించిన విమానంలో ఏసీ వాల్వ్ లీకైందని సమాచారం.