నేడు విజయనగరంకు నారా భువనేశ్వరి... రైలు ప్రమాద బాధితులకు పరామర్శ 

Published : Oct 31, 2023, 11:06 AM ISTUpdated : Oct 31, 2023, 11:14 AM IST
నేడు విజయనగరంకు నారా భువనేశ్వరి... రైలు ప్రమాద బాధితులకు పరామర్శ 

సారాంశం

నేడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విజయనగరం రైలు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించనున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన భార్య నారా భువనేశ్వర్ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఓవైపు తన భర్త అరెస్ట్ కు నిరసనలు, ఆందోళనలు చేపడుతూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు భువనేశ్వరి. అంతేకాదు వివిధ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లోకి కూడా వెళుతున్నారు. ఇలా చంద్రబాబు పాత్రను భువనేశ్వరి పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు భువనేశ్వరి సిద్దమయ్యారు. 

మంగళవారం విజయనగరంలో జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నట్లు టిడిపి ప్రకటించింది. కంతకపల్లి వద్ద  గత ఆదివారం చోటుచేసుకున్న రైలు ప్రమాద బాధితుల‌ను ఆమె పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు. అలాగే క్షతగాత్రుల కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోన్నారు.  

Read More  చంద్రబాబుకు ఊరట: స్కిల్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

నవంబర్ 1 అంటే రేపటి నుండి భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సుయాత్ర కొనసాగనుంది. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలతో ఆవేదన చెంది మృతిచెందిన వారి  కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఈ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే పలుజిల్లాల్లో పర్యటించిన ఆమె రేపటినుండి మూడు రోజులపాటు  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.
 


 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్