పోలీసుల అదుపులో వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి.. కిడ్నాప్ కేసులో అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Oct 31, 2023, 9:11 AM IST

వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. 


ఎర్రగుంట్ల :  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అపూర్వగా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతిని కిడ్నాప్ కేసులో దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  నెలరోజుల క్రితం వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో  ఓ ప్రేమ వివాహం జరిగింది. . ఈ వివాహం విషయంలో దర్యాప్తుకు సంబంధించి..  దస్తగిరి పై  కిడ్నాప్ ఆరోపణలు వచ్చిన  నేపథ్యంలో  అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

click me!