Chandrababu Bail : నేడు హైకోర్టు విచారించే చంద్రబాబు కేసులివే...  ఉచ్చు బిగుస్తుందా లేక ఊరట లభిస్తుందా?

By Arun Kumar P  |  First Published Nov 23, 2023, 11:18 AM IST

అమరాావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,  లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలుచేసిన పిటిషన్లపై నేడు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై నమోదైన పలు కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు ఇతర కేసుల్లో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇలా  రెండుకేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారించనుంది.  

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు   ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. మొన్న(మంగళవారం) ఈ పిటిషన్ విచారణ జరపగా వాదించేందుకు తమకు సమయం కావాలని సిఐడి తరప లాయర్లు న్యాయమూర్తిని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసారు. ఇవాళ సిఐడి లాయర్లు ఈ ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తమ వాదన వినిపించనున్నారు. 

Latest Videos

ఇక మద్యం పాలసీ విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారంటూ సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో కూడా తనను అరెస్ట్ చేయకుండా చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ గత రెండ్రోజులుగా విచారణ జరిపుతున్న న్యాయస్థానం ఇవాళ కూడా కొనసాగించనుంది. 

మద్యం పాలసీ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిన్న చంద్రబాబు లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. సిఐడీ చేసిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. 17A అమ్మైండ్మెంట్ యాక్ట్ ఈ కేస్ కు వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 

Read More  Chandrababu : ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత... నేరం కాదు : హైకోర్టుకు చంద్రబాబు లాయర్లు

ఇక ఇదే మద్యం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కొల్ల రవీంద్రపై కూడా సిఐడి కేసు నమోదు చేసింది. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా దీనిపైనా నేడు విచారణ జరగనుంది. 

ఇదిలావుంటే అమరావతి అసైండ్ భూముల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి ఆరోపిస్లోంది. ఈ కేసుపై ఇప్పటికే విచారణ పూర్తవగా దీన్ని రీఓపెన్ చేయాలని  సిఐడి హైకోర్టును కోరింది. ఇలా సిఐడి దాఖలుచేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. 

click me!