vijayasai reddy : పురందేశ్వరి గారూ.. ఇంత ఆత్మవంచన అవసరమా ? - విజయసాయి రెడ్డి

Published : Nov 22, 2023, 05:22 PM IST
vijayasai reddy : పురందేశ్వరి గారూ.. ఇంత ఆత్మవంచన అవసరమా ? - విజయసాయి రెడ్డి

సారాంశం

vijayasai reddy : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ విమర్శలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం పట్ల సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. సంతోషంగా లేకపోతే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని సూచించారు.

వైసీపీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి (vijayasai reddy) మళ్లీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (purandeswari) పై విమర్శలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిందని సంతోషంగా ఉన్నట్టున్నారని అన్నారు. అలా లేకపోతే వెంటనే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాయాలని కోరారు.

కాటేసిన పామును హాస్పిటల్ కు తీసుకొచ్చిన యువకుడు.. అనంతరం బెడ్ పై ఉంచి వైద్యం

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ‘‘అందులో ఎవరికి బెయిల్ వచ్చినా సంతోషిస్తారు చిన్నమ్మా! కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చెయ్యమంటారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి గారూ? తను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావ గారికి బెయిల్ వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. అయ్యో! అలాంటిది ఏమీ లేదంటే.. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు సీజీఐ గారికి లేఖ రాయాలి’’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. ప్రయాణికులందరూ చూస్తుండగానే దారుణం..

కాగా.. ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పురందేశ్వరి సీజేఐకు గతంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి తాజా విమర్శలు చేశారు. అయితే గత కొంత కాలం నుంచి ఆయన పురందేశ్వరిపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఆమె బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి.

deepfake : గర్భా అడిన ప్రధాని వీడియో డీప్ ఫేక్ కాదు.. వైరలైన క్లిప్ లో ఉన్నది ఎవరో తెలుసా ?

ఇటీవల ‘ఎక్స్’ చేసిన పోస్టులో ‘‘పురందేశ్వరి గారూ... మీరు టీడీపీలో ఎన్నాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ కు ఎందుకు వెళ్ళారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు.  కనీసం బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారన్నదైనా చెప్పగలరా?’’ అని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu