breaking news : కూతురిని వేధిస్తున్నారని అల్లుడు, తల్లిదండ్రుల దారుణ హత్య..

Published : Nov 23, 2023, 08:12 AM IST
breaking news : కూతురిని వేధిస్తున్నారని అల్లుడు, తల్లిదండ్రుల దారుణ హత్య..

సారాంశం

మాధురి, అనంత నరేష్ లు భార్యాభర్తలు. కాగా, కొంత కాలంగా వీరి ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. 

పల్నాడు : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో ముగ్గురిని హత్య చేశారు. కూతురిని వేధిస్తున్నారని.. ఆమె భర్త, అత్తమామలను కత్తులతో పొడిచి చంపారు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. మాధురి, అనంత నరేష్ లు భార్యాభర్తలు. కాగా, కొంత కాలంగా వీరి ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పెద్దల సమక్షంలో చర్చించుకునేందుకు మాధురి కుటుంబ సభ్యులు కోనంకి వెళ్లారు. అక్కడి వీరి చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నరేష్ కుటుంబంపై కత్తులతో దాడికి దిగారు మాధురి బంధువులు. ఈ దాడిలో అనంతసాంబశివరావు, ఆదిలక్ష్మి, అనం నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. హత్యల తరువాత  నిందితులు శ్రీనివాస్, సుబ్బారావులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం