వాయుగుండం : నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

By AN TeluguFirst Published Sep 25, 2021, 11:51 AM IST
Highlights

దీని ప్రభావంతో నేడు ఒడిసా, కోస్తాంధ్రలలో అక్కడక్కడ భారీ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు దక్షిణ ఒడిసా ఉత్తరాంధ్రలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల కుంభవృష్టి కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తూర్పు మధ్య, దాన్ని ఆనుకున్న ఈశాన్య బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా గంటకు సుమారు 14 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నిన్న అర్థరాత్రి సమయానికే ఈ వాయుగుండం గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా 580 కిలో మీటర్లు, కళింగపట్నానికి తూర్పుగా 660 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైందని తెలిపింది.

ఇది తీవ్ర వాయుగుండంగా మారి, మరి కొన్ని గంటలు పశ్చిమ వాయవ్యంగానే పయనించి అనంతరం పశ్చిమ నైరుతి దిశగా మరలి రేపు సాయంకాలానికి దక్షిణ ఒడిసా ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటగలదని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో నేడు ఒడిసా, కోస్తాంధ్రలలో అక్కడక్కడ భారీ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు దక్షిణ ఒడిసా ఉత్తరాంధ్రలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల కుంభవృష్టి కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఈనెల 27న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిసాలో భారీ వర్షాలు కొనసాగుతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక ఉత్తరాంధ్ర మత్స్యకారులు వేటకు వెళ్ల రాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

click me!