పద్మ అనే మహిళ.... తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవ సమయం దగ్గర పడడంతో నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆ సమయానికి ఆమె కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాహనం ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సమయంలో వాహనం అందుబాటులో లేదని అంబులెన్స్ కంట్రోల్ తెలిపింది.
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ (Women Safety)కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ (Disha App) బాగా పనిచేస్తోంది. దిశ SOS కాల్‌లకు వెంటనే స్పందించిన పోలీసులు శుక్రవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక గర్భిణిని ఆసుపత్రికి సమయానికి ఆస్పత్రికి చేర్చారు. అలాగే లైంగిక వేధింపులకు(Sexual Assault) పాల్పడబోతున్న పక్కింటివ్యక్తి నుంచి మరొక మహిళను రక్షించారు.
మొదటి సంఘటన ప్రకాశం జిల్లా చీరాల ఇపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెంలో గురువారం అర్థరాత్రి జరిగింది, రెండవది శుక్రవారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం తుంబురు హరిజనవాడలో జరిగింది.
undefined
ప్రకాశం ఎస్పీ మాలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం, పద్మ అనే మహిళ.... తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవ సమయం దగ్గర పడడంతో నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆ సమయానికి ఆమె కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాహనం ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సమయంలో వాహనం అందుబాటులో లేదని అంబులెన్స్ కంట్రోల్ తెలిపింది.
దీంతో ‘ఏం చేయాలో తోచని కుటుంబ సభ్యులు వెంటనే దిశ SOS కు కాల్ చేసి కంట్రోల్ రూమ్‌కు తమ పరిస్థితిని వివరించారు. ఈ ఫోన్ కాల్ కు స్పందించిన పోలీసులు ఇపురుపాలెం ఎస్ఐ సుబ్బారావుకు సమాచారం అందించగా, ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక హోంగార్డును ఆటోరిక్షాలో సంఘటనా స్థలానికి పంపించారు. ఆ ఆటోలో పద్మ కుటుంబం ఆమెను చీరాలలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది’...అని ఎస్పీ చెప్పారు.
ఆ తరువాత శుక్రవారంనాడు పోలీసులు సదరు మహిళకు బేబీ కిట్ అందించారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పద్మ కుటుంబానికి ధైర్యాన్ని కలిగించారు. సమయానికి స్పందించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన ఇపురుపాలెం ఎస్‌ఐ. కంటబుల్ గోపి కృష్ణ,హోంగార్డ్ సాంబి రెడ్డిని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రశంసించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే..?
మరో ఘటనలో, చిత్తూరులోని నారాయణవనం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో లైంగిక వేధింపులకు గురవుతున్న 20 ఏళ్ల యువతిని కాపాడారు. SOS కాల్ అందుకున్న 9 నిమిషాల తర్వాత, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా ఎస్‌పి సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... 20 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పొరుగున ఉన్న విక్రమ్ (28) ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. అతని కదలికలు అనుమానం కలిగించడంతో ఆమె వెంటనే మొబైల్ ఫోన్.. దిశ యాప్‌లోని SOS బటన్‌ను నొక్కింది. కాల్‌కి స్పందించిన నారాయణవనం ఎస్‌ఐ ప్రియాంక, పోలీసుల బృందం తొమ్మిది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో అతను ఆమెమీద దాడిప్రారంభించాడు. పోలీసులు వెంటనే ఆ మహిళను రక్షించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని కోర్టు రిమాండ్ కు పంపింది.