బాలికపై చిన్నాన్న కుమారుడి కన్ను..!

Published : Sep 25, 2021, 10:55 AM ISTUpdated : Sep 25, 2021, 10:59 AM IST
బాలికపై చిన్నాన్న కుమారుడి కన్ను..!

సారాంశం

బాధిత బాలికపై చిన్నాన్న కుమారుడు నాలుగు నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ పరువుపోతుందని ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 

బాలికపై సొంత చిన్నాన్న కుమారుడు కన్నేశాడు. వరసకు తాను తనకు చెల్లి అవుతందనే కనికరం కూడా లేకుండా దారుణంగా అయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 21 నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై తల్లిదండ్రులు డెంకాడ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి బాలిక ఆచూకీని కనుగొన్నారు. దర్యాప్తులో షాక్‌కు గురిచేసే అంశాలను గుర్తించారు. బాధిత బాలికపై చిన్నాన్న కుమారుడు నాలుగు నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ పరువుపోతుందని ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 

తర్వాత ఆమె అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. మూడు నెలల గర్భిణి అని తేలడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్న వయసు కావడంతో గర్భస్రావం అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు బయటకు పొక్కనీయలేదు. అప్పటి నుంచి నిందితుడు గ్రామంలో లేడు. 

విశాఖలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇటీవలే తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. అతనిని చూసిన బాధిత బాలిక భయాందోళనకు గురై పరారైంది. పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ తేలడంతో కేసును డెంకాడ పోలీసులు దిశ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేశారు. డీఎస్పీ త్రినాథ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు