
నంద్యాల ఉప ఎన్నీకల్లో ముస్లీంల పంట పండింది. ఇప్పటికే టిడిపి తరుపున ఒక ఎమ్మెల్సీ ఫరుక్ ఉన్నారు. ఇప్పుడు అక్కడి ముస్లీం ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ మరో ఎమ్మెల్సీ సీటును హామీగా ప్రకటించారు.
నేడు నంద్యాలలో వైసీసి భారీ బహిరంగ సభ జరిగింది అందులో జగన్ ముఖ్య అథితిగా పాల్గోన్నారు. ఆయన ముస్లీం ఓటర్లను ఆకట్టుకొవడానికి తమకి రాబోయో ఎమ్మెల్సీ సీటును వారికి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపి పార్టీకి 2018 సంవత్సరంలో మరో ఎమ్మేల్సీ సీటు వస్తుందని, ఆ సీటును నంద్యాల ముస్లీంలకే ఇస్తామని ఆయన పెర్కోన్నారు. తమ పార్టీ ని గెలిపించండి మీ అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. తమ తమ పార్టీ గెలుపును టిడిపి తరుపున ఎంత మంది ప్రచారం చేసిన ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే వైసీపి నవ రత్నాల హామీను ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన విషయం తెలిసిందే.