రాళ్లు విసిరిన వారిని చూశారా అని తిరుపతి పోలీసులు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించారు.
తిరుపతి : రాళ్లు విసిరిన వారిని చూశారా అని తిరుపతి పోలీసులు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించారు.ఈ నెల 12వ తేదీన తిరుపతి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ విషయమై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
సోమవారం నాడు తిరుపతి రైల్వేస్టేషన్ నుండి కృష్ణాపురం వరకు బాబు రోడ్ షో నిర్వహించారు. ఇక్కడే సభలో ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార వాహనం వద్దే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.ఆ తర్వాత ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు.
undefined
also read:చంద్రబాబు సభపై రాళ్ల దాడి: తిరుపతిలో కేసు నమోదు
మంగళవారం నాడు ఉదయం తిరుపతి వెస్ట్ పోలీసులు చంద్రబాబునాయుడు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని చూశారా?, రాళ్లు ఏ వైపు నుండి వచ్చాయనే విషయమై ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని గుర్తు పడతారా అని బాబు సెక్యూరిటీని ప్రశ్నించారు. అంతేకాదు చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు పరిశీలించారు. కాన్వాయ్ ను తిరుపతి అర్బన్ పోలీసులు వీడియో తీశారు.తిరుపతి ఘటనపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది. మరోవైపు ఇదే విషయమై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.