కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల, హనుమంతుడి జన్మస్థలమని తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల, హనుమంతుడి జన్మస్థలమని తితిదే ఈవో కేఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హనుమంతుడు జన్మస్థలంపై పండితులు ఆధారాలు సేకరించారు. తితిదే వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతాం. ఆధారాలతో నివేదిక తయారు చేశాం.
undefined
నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తాం.. హనుమ జన్మస్థలం తమదేనని ఏ రాష్ట్రం ప్రకటించలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలు ఉంటే బయటపెట్టొచ్చు. హనుమంతుడి జన్మస్థలం మీద క్షేత్ర స్థాయిలో చర్చ జరగాలి అని జవహర్ రెడ్డి అన్నారు.
కాగా ఇప్పటికే.. అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతోసహా నిరూపించేందుకు 2020 డిసెంబరులో టిటిడి పండితులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పలు సమావేశాలు నిర్వహించి లోతుగా అధ్యయనం చేసిన ఈ కమిటీ హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు దోహదపడే బలమైన ఆధారాలు సేకరించింది.
జ్యోతిషశాస్త్రం, పురాతన శాసనాలు, పురాణాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కమిటీ ఈ సమాచారాన్ని నిర్ధారించింది. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రేననే వివరాలతో టీటీడీ త్వరలోనే ఒక సమగ్రమైన పుస్తకాన్ని కూడా తేనుంది.
శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచలమహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్సంహితల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామివారి చెంతగల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థానమని యుగం, తేదీల ప్రకారం నిర్ధారించారు.