తిరుమల మరో సారి చిరుత అలజడి.. అలిపిరి మెట్ల మార్గంలో కదలికలు

By Sairam Indur  |  First Published Dec 30, 2023, 11:05 AM IST

తిరుమల మెట్ల మార్గంలో మరో సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలుసుకున్నారు.


ప్రముఖ దేవస్థానం తిరుమలలో మరో సారి చిరుతల అలజడి కలకలం రేకెత్తిస్తోంది. అలిపిరి నడక మార్గంలో వారి సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలిసింది. గతంలో చిన్నారి లక్షితపై చిరుత పులి దాడి చేసిన ప్రాంతంలో వాటి కదలికలు ఉన్నట్టు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. 

శ్రీమంతురాలు కావాలని నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. తరువాత ఏం జరిగిందంటే ?

Latest Videos

ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఈ నెల 13, 26వ తేదీల్లో చిరుత, ఎలుగుబంటి సంచారం అందులో కనిపించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తం అయ్యింది. నడక మార్గంలో వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భక్తులు ఒంటరిగా కాకుండా, గుంపులు గుంపులుగా రావాలని కోరింది.

పట్టాలపై గ్యాంగ్ వార్.. ట్రైన్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి... 

గత నెల 13వ తేదీన కూడా  తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో  చిరుత కనిపించింది. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను భక్తులు చూశారు. దీంతో వారు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. చిన్నారి లక్షితపై దాడి తరువాత ఫారెస్టు అధికారులు ఇప్పటి వరకు ఆరు  చిరుతలను బంధించారు. అలాగే చిరుత పులులు మెట్ల మార్గంలో  రాకుండా  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

అందులో భాగంగా భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. మెట్ల మార్గంలో ఎవరూ ఆహారాన్ని వేయొద్దని సూచించారు. ఆహారం కోసం ఈ ప్రాంతానికి చిరుతపులులు వస్తున్నాయని టీటీడీ అధికారులు  భావిస్తున్నారు. మెట్ల మార్గంలో  వన్యప్రాణులకు ఆహారం వేసే వారిని కఠినంగా శిక్షిస్తామని టీటీడీ గతంలో హెచ్చరించింది.

Bihar: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన విమానం.. పోలీసుల సూపర్ సొల్యూషన్.. వైరల్ వీడియో ఇదే

ఈ ఏడాది ఆగస్టు నెలలో నెల్లూరు జిల్లాకు చెందిన  మూడేళ్ల చిన్నారి లక్షితపై  చిరుత దాడి చేసింది.ఈ దాడిలో లక్షిత  మృతి చెందింది.  లక్షిత కంటే ముందే మరో బాలుడిపై  కూడ చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో  ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో  బాలుడిని  కొద్ది దూరం తీసుకెళ్లి చిరుత వదిలి వెళ్లింది. దీంతో  ఆగస్టు,  సెప్టెంబర్ మాసాల్లో  చిరుతలను బంధించేందుకు  ఫారెస్ట్, టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతల కదలికలున్న మార్గాల్లో బోన్లను ఏర్పాటు చేసి  వాటిని బంధించారు.  అయితే  చిరుతల నుండి రక్షణ కోసం అలిపిరి మెట్ల మార్గంలో  వెళ్లే భక్తులకు  కర్రలను అందజేశారు.

click me!