రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ పై ఏపీ ప్రభుత్వం చర్యలను సుప్రీంకోర్టు సోమవారం నాడు నిలిపివేయాలని ఆదేశించింది. దేశద్రోహ పరిమితులను తాము నిర్వహించే సమయం ఇది అని పేర్కొంది.
న్యూఢిల్లీ: రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ పై ఏపీ ప్రభుత్వం చర్యలను సుప్రీంకోర్టు సోమవారం నాడు నిలిపివేయాలని ఆదేశించింది. దేశద్రోహ పరిమితులను తాము నిర్వహించే సమయం ఇది అని పేర్కొంది.తెలుగు న్యూస్ ఛానెల్స్ టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీవీ5, ఎబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్స్ పై రాజద్రోహం కేసులు నమోదు చేసింది. ఈ కేసుల నమోదును ఈ రెండు చానెల్స్ యాజమాన్యాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. దేశద్రోహన్ని కోర్టు నిర్వహించే సమయం ఇదని జస్టిస్ డివై చంద్రచూఢ్ చెప్పారు.
also read:సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ మీద రఘురామ సంచలన ఆరోపణలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు దేశద్రోహ ఆరోపణలతో ఈ రెండు ఛానెల్స్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపన్యాసాలను తమతో పాటు పలు మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయని టీవీ 5 కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఈ నెల 14న ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 21న మంజూరు చేసింది.