విషాదం : నెల్లూరులో గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి...

By AN Telugu  |  First Published Nov 22, 2021, 12:14 PM IST

ఈ ఘటనలో అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతి చెందగా కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అబ్బాస్, భార్య నౌషాద్ లో నెల్లూరులో టిఫిన్ అంగడి నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం కూడా టిఫిన్ తయారు చేయడానికి స్టౌ ముట్టించగా గ్యాస్ లీక్ అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. 


నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో తెల్లవారు జామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. 

ఈ ఘటనలో అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతి చెందగా కుమార్తె అయేషా Nellore ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అబ్బాస్, భార్య నౌషాద్ లో నెల్లూరులో టిఫిన్ అంగడి నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం కూడా టిఫిన్ తయారు చేయడానికి స్టౌ ముట్టించగా Gas leak అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. 

Latest Videos

undefined

దీంతో ముందు భార్య నౌషాద్ కు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన భర్త అబ్బాస్ కాపాడడానికి వెళ్లడంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరి పదమూడేళ్ల కూతురు అయేషా అక్కడే ఉండడంతో ఆమెకు కూడా Fires అంటుకున్నాయి. అయితే ప్రమాదాన్ని గమనించిన స్తానికులు అయేషాను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయేషా మరణించింది. 

Rayala Cheruvu: చిత్తూరు జిల్లాలో ప్రమాదపు అంచున రాయలచెరువు.. 100 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు.. !

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ను వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలతో వరదలు సంభవించి భారీగా ఆస్తినష్టాన్ని సృష్టించడమే కాదు చాలామంది ప్రాణాలను బలయ్యాయి. ఈ వరదలకు పుట్టినరోజునాడూ ఓ బాలిక తన సోదరుడితో సహా నదిలో కొట్టుకుపోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఇటీవల kadapa district లోvery  heavy rains కురవడంతో వరద నీటితో మాండవ్య నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే కడప జిల్లా చాకిబండ గ్రామానికి చెందిన అమీన్ బాషా కూతురు షేక్ సాజియా(16). ఆమె తన పుట్టినరోజున అమ్మమ్మ వారి ఇంట్లో జరపుకోవాలనుకుంది. దీంతో కూతురితో పాటు కొడుకు జాసిర్(11) ను తీసుకుని తండ్రి అమీన్ బాషా ద్విచక్రవాహనంపై చిత్తూరు జిల్లా కలకడకు బయలుదేరారు. 

అయితే ఇటీవల వర్షాలతో భారీగా వరదనీరు చేరడంతో చిన్నమండెం మండల పరిధిలోని వండాడి గ్రామం వద్ద మాండవ్య నదిలో నీటిప్రవాహం పెరిగి రోడ్డుపైనుండి ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ నదిని పిల్లలిద్దరితో కలిసి దాటడానికి తండ్రి ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిప్రవాహ దాటికి అక్కా, తమ్ముడు సాజియా, జాసిర్ కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు తండ్రి అమీన్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. 

పుట్టినరోజునే బాలికతో పాటు ఆమె సోదరుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరద ఆ తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చింది. చిన్నారులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. నదిలో నీటిఉదృతి ఎక్కువగా వుండటంతో చిన్నారులిద్దరి మృతదేహాలు లభ్యం కాలేవు. గాలింపుకొనసాగుతోంది. 
 

click me!