CJI NV Ramana: రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

Published : Nov 22, 2021, 11:53 AM IST
CJI NV Ramana: రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

సారాంశం

పుట్టపర్తిలోని (Puttaparthi) సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ కార్యక్రమానికి (Sathya Sai university convocation)  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Supreme Court Chief Justice NV Ramana) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవరసం ఉందని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.  

సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవరసం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Supreme Court Chief Justice NV Ramana) అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అనంతపరం పుట్టపర్తిలోని (Puttaparthi) సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవ కార్యక్రమానికి (Sathya Sai university convocation) జస్టిస్ ఎన్వీరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందుకోసం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా ఆదివారం.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి (Puttaparthi) చేరుకున్నారు. సోమవారం సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి సమాధిని సీజేఐ దర్శించుకున్నారు. అనంతరం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన చేతుల మీదుగా 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు, విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులకు సీజేఐ అభినందనలు తెలిపారు. విద్యార్తులు కీలక దశ ముగించుకుని తర్వాత దశకు వెళ్తున్నారని అన్నారు. 

మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆధునిక గురుకులాలకు ఈ వర్సిటీ ఆదర్శ నమునా అని తెలిపారు. విలువలతో విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలని కోరారు. సత్యసాయి అందించిన ప్రేమను మనం అందించాలని అన్నారు సత్యసాయి తన ప్రేమను మనుషులకే కాదు.. సమాజానికి అందించారని చెప్పారు. నిస్వార్ధ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరం అని తెలిపారు.

ఈ విలువలను విద్యార్థులు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చకోవాలని ఆకాంక్షించారు. సత్యసాయి ఎక్కడికి వెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారని చెప్పారు. సత్యసాయి మార్గాన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈనాటి తన పదవులు, గౌరవానికి సత్య సాయి ఆశీస్సులే కారణమని అన్నారు.

‘నేటికి వర్తించే ఎన్నో అంశాలు రామాయణం, మహాభారతంలో ఉన్నాయి. పెద్దలను గౌరవిస్తున్నారా అనేది పాలకులు గుర్తుంచుకోవాలని. ప్రజలను బాగా చూసుకుంటున్నారో లేదో ఆలోచించుకోవాలి. బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా అనేది ఆలోచించాలి. ఒక్కసారి అధికారంలోకి వస్తే 14 అవలక్షణాలు వస్తాయి. అవలక్షణాలను సరిచేసుకుని మంచి పాలన అందించాలి’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్