మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకొంది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ విన్న వించారు.
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ కు హైకోర్టుకు తెలిపారు.సోమవారం నాడు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసరంగా జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొన్ని చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా అడ్వకేట్ జనరల్ ఇవాళ ఏపీ హైకోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై జగన్ సర్కార్ ముందుకు పోతామని గతంలో స్పష్టం చేసింది. అయితే మూడు రాజధానుల అంశంపై ఇవాళ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొంది. మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు,పలు సంస్థలు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో మూడు రాజధానులపై తీసుకొచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకొన్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.ఈ విషయమై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రకటన చేస్తారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
also read:రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు.. ‘రాజధానిగా అమరావతికే మద్దతు’
2020 జనవరి 20వ తేదీన ap assemblyలో మూడు రాజధానులపై ప్రవేశపెట్టిన బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. amaravatiలో శాసనస రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఏపీ సీఎం ys jaganప్రకటించారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది.
మరోవైపు ఏపీ రాష్ట్ర శాసనమండలిలో tdpకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లులను సెలెక్ట్ పంపాలని తాము కోరామని అప్పట్లో టీడీపీ సభ్యులు చెప్పారు. ఏపీ శాసన సభ నుండి 2020 జూన్ 17న రెండోసారి ఈ బిల్లులను ఏపీ శాసనమండలికి పంపారు. అయితే ఈ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టడానికి ముందే శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్ ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారుఅయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, bjp, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగుతుంది. నిన్న బీజేపీకి చెందిన నెల్లూరు జిల్లాలో ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.
నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపిన మరునాడేఏపీ సర్కార్ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇవాళ నిర్వహించిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై చేసిన చట్టాలను వెనక్కి తీసుకొంది. అయితే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు ఈ విషయమై మీడియాతో మాట్లాడడానికి మంత్రులు నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కేబినెట్ సమావేశం నిర్ణయాలను అసెంబ్లీలోనే ప్రకటించాల్సి ఉన్నందున మంత్రులు మాట్లాడేందుకు నిరాకరించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏ రకమైన ప్రకటన చేస్తారోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజధానిపై ఏపీ అసెంబ్లీలో కొత్త బిల్లు?
మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్న ఏపీ సర్కార్ మరో కొత్త బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కొత్త బిల్లును ఏపీ సర్కార్ ఇవాళ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కొత్త బిల్లులో ఏపీ సర్కార్ ఏం చెప్పనుందనే విషయమై ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.