
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.