నాన్ అకడమిక్ ప‌నుల ఒత్తిడి.. వీఆర్ఎస్ వైపు అడుగులేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులు !

Published : Feb 18, 2023, 10:29 AM IST
నాన్ అకడమిక్ ప‌నుల ఒత్తిడి.. వీఆర్ఎస్ వైపు అడుగులేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులు  !

సారాంశం

Vijayawada: ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు ఒక‌రు మాట్లాడుతూ.. "విద్యార్థులకు చదువు చెప్పేందుకు ప్రభుత్వోద్యోగంలో చేరాం. వారి అకడమిక్ పనితీరును మెరుగుపరిచేందుకు మాకు ఇచ్చిన ఏ పని అయినా స్వాగతించదగినదే కాని విద్యాయేత‌ర‌ పనుల కోసం మమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేయడం  చాలా ఆందోళన కలిగిస్తుందని" అన్నారు.  

Andhra Pradesh govt teachers-VRS: విద్యాను మాత్ర‌మే బోధించ‌డానికి ఉపాధ్యాయుల‌ను నియ‌మించుకుంటున్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాలు వారిని అనేక ఇత‌ర ప‌నుల కోసం ఉప‌యోగించుకుంటున్నాయి. అయితే, ఇదివారి బోధ‌న‌పై ప్ర‌భావం చూప‌డంతో పాటు విద్యార్థుల అభ్య‌స‌న విష‌యంలో ఒక స‌మ‌స్య‌గా ఉంది. ఇక‌ ఆంధ్ర‌ప్రదేశ్ లో అకడమికేతర ప‌నుల భారం పెరిగిపోతున్న‌ద‌ని ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  వారు స్వచ్ఛంద పదవీ విరమణకు మేల‌ని భావిస్తున్నార‌ని తెలిసింది.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక ప్రయోజనాల్లో జాప్యం జరుగుతుండటంతో అకడమికేతర పనుల ఒత్తిడిని భరించలేకపోతున్నామని ఓ వర్గం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అలాగే, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కు సిద్ధమవుతున్నారు. పాఠశాల భవనాల పునరుద్ధరణ, నిర్మాణం, మధ్యాహ్న భోజనానికి ఆహారం తయారీ వంటి పనులను పర్యవేక్షించాలనీ, ఈ పనులకు సంబంధించి ఆన్ లైన్ లో చాలా డేటాను సమర్పించాలని అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. "మంజూరైన డబ్బును ఒక్కరోజులో ఖర్చు చేసి బిల్లులు సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడుతున్నారు. నిర్మాణ సామగ్రి, మేస్త్రీలు, కూలీలు మొదలైన వాటి లభ్యతతో నిర్మాణ పనుల పురోగతి ముడిపడి ఉన్నప్పుడు మేము ఈ విషయాలను ఎలా నిర్వహించగలము" అని ఉపాధ్యాయులు అంటున్నారని డీసీ నివేదించింది. 

నాడు-నేడు ఫేజ్-1 కింద ఒక్కొక్కరు రూ.33 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సొంత జేబుల నుంచి భవన నిర్మాణ పనులకు ఖర్చు చేశారనీ, రెండేళ్లు గడిచినా నిధులు విడుదల కాలేదని కొందరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఎన్నికల విధుల నుంచి రిలీవ్ అవుతున్నప్పటికీ పనిభారం, పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని వారు చెబుతున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రధాన కర్తవ్యం అకడమికేతర పనుల పర్యవేక్షణలో తలమునకలై ఉండటం వల్ల పక్కదారి పడుతోందని వాపోతున్నారు. 28 ఏళ్ల సర్వీసు, ఐదేళ్ల వెయిటేజీతో సహా 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినప్పటి నుంచి చివరి వేతనంలో 50 శాతం పింఛను పొంది స్వచ్ఛంద పదవీ విరమణ పొందవచ్చనే నిబంధన ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు వీఆర్ఎస్ ను ఎంచుకునేందుకు సిద్ధమవుతున్న‌ట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 

విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే ప్రభుత్వ సర్వీసులో చేరామని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు తెలిపారు. వారి అకడమిక్ పనితీరును మెరుగుపరచడానికి మాకు ఏ పని అప్పగించినా స్వాగతించదగినదే కానీ నాన్ అకడమిక్ పనుల కోసం మమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేయడం మమ్మల్ని చాలా ఆందోళనకు గురిచేస్తోంద‌ని తెలిపారు. "విద్యార్థులకు చదువు చెప్పేందుకు ప్రభుత్వోద్యోగంలో చేరాం. వారి అకడమిక్ పనితీరును మెరుగుపరిచేందుకు మాకు ఇచ్చిన ఏ పని అయినా స్వాగతించదగినదే కాని విద్యాయేత‌ర‌ పనుల కోసం మమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేయడం  చాలా ఆందోళన కలిగిస్తుందని" అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం