తూర్పుగోదావరి జిల్లాలో విషాదం: షుగర్ ప్యాక్టరీలో పేలుడు, ఇద్దరు మృతి

By narsimha lodeFirst Published Aug 19, 2022, 12:55 PM IST
Highlights

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు జరిగిన పేలుడులో  ఇద్దరు  మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు.

కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఇద్దరు  మృతి చెందారు. మరో నలుగు రుతీవ్రంగా గాయపడ్డారు.ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో  కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుడు చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.మరో ఆరుగురు గాయపడ్డారు.  మరణించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారుగా కార్మికులు చెబుతున్నారు.  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం తెలిపింది.

గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలోని సెజ్ లో ఇటీవల కాలంలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.  గతంలో విశాఖలోని ఎల్ జీ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అన్ని ఫ్యాక్టరీల్లో  రక్షణ చర్యలు  చేపట్టాలని కూడా ఆదేశించింది. 

అయినా కూడా ఆయా ఫ్యాక్టరీల్లో  తరచుగా ప్రమాదాలు చోటు చేసుకోవడంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు తీసుకోకోపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై కూడా అధికారులు దర్యాప్తు చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 


 


 


 
 

click me!