హైకోర్టు ఆదేశించినా జీతభత్యాలు ఇవ్వలేదు, కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసిన ఏబీ వెంకటేశ్వరరావు..

By Bukka SumabalaFirst Published Aug 19, 2022, 8:46 AM IST
Highlights

హైకోర్టు ఆదేశించినా తనకు సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు ఇవ్వలేదంటూ ఏపీ ప్రభుత్వం మీద సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. 

అమరావతి : హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉండగా అవి చెల్లించలేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు సిఎస్ సమీర్ శర్మను శిక్షించాలని కోరారు. న్యాయమూర్తులు జస్టిస్ dvs somayajulu, జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ప్రతివాదిగా ఉన్న సీఎస్ సమీర్ శర్మకు నోటీసు జారీ చేసింది. 

కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని హోం శాఖ జీపీ మహేశ్వర్ రెడ్డి కోరగా, అంగీకరించిన ధర్మాసనం, విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఐసీఎస్ అధికారి ఏబీ వెంకటేవ్వరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. దాని మీద జోక్యం చేసుకోవడానికి కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్ (క్యాట్) నిరాకరించింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమంటూ.. సంబంధిత జీవోను కొట్టివేస్తూ హైకోర్టు 2020మే 22న తీర్పు ఇచ్చింది. 

టీడీపీకి సహకరిస్తే నల్లుల్లా నలుపేస్తా.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా..

పిటిషనర్ కు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు వేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న  కొట్టి వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22 నుంచి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించడం ప్రారంభించింది.  హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు  తాజాగా   కోర్టు ధిక్కరణ  వ్యాజ్యం దాఖలు చేశారు.  

హైకోర్టు ఆదేశాల మేరకు జీతభత్యాలు ఇవ్వాలని సిఎం కు లేఖ రాసిన స్పందన లేదు అన్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు.  పిటిషనర్కు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని అన్నారు,  ఆ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదిగా ఉన్న సీఎస్ను పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది.
 

click me!