టీడీపీకి సహకరిస్తే నల్లుల్లా నలుపేస్తా.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా..

By Bukka SumabalaFirst Published Aug 19, 2022, 7:51 AM IST
Highlights

టీడీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విరుచుకుపడ్డాడు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

వినుకొండ : పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ నేతలమీద మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై విరుచుకుపడ్డారు. తాను అభివృద్ధి చేస్తుంటే ఆంజనేయులు కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారు అని ఆరోపించారు. జీవీకి సహకరించే కొన్ని నల్లులు ఉన్నాయని, వాళ్లను నలిపేస్తామని హెచ్చరించారు,

కాగా, గతంలో  కూడా బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 5న తన వెంటే ఉంటూ గోతులు తీస్తున్నారంటూ ఆరోపించారు. ఎవరిని వదిలిపెట్టనని, అందర్నీ గుర్తుపెట్టుకుంటాం అని బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు.  వేల్పూరులో తానే నాయకుడిని.. తన కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. తన కారుపై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు రాళ్ల దాడి చేయించారని బొల్లా ఆరోపించారు. దానికి కొంతమంది వెనక ఉండి సపోర్టు ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

బొల్లా బ్రహ్మనాయుడు ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఓ టీవీ చానెల్ ప్రతినిధిని అందరి ముందు తిడుతున్న మీడియాతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బ్రహ్మనాయుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిరుడు వినుకొండ పట్టణంలో  బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రసాభాసగా మారింది. రైతుల భూముల్లో నుంచి రోడ్డు ఎలా వేస్తారు అంటూ కొందరు ఎదురు తిరగడంతో విషయం సీరియస్ అయ్యింది. 

రైతులకు కనీస నష్ట పరిహారం చెల్లించకుండా ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు పంపించింది. ముందస్తు నోటీసును లేకుండానే నిర్మాణాలు కూల్చివేశారు అంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బొల్లా బ్రహ్మనాయుడుకి నోటీసులు ఇచ్చింది. 

click me!