ఇంటిముందు ఆడుకుంటూ.. కనిపించకుండా పోయిన 3 చిన్నారులు.. !

Published : Jun 22, 2021, 11:28 AM IST
ఇంటిముందు ఆడుకుంటూ.. కనిపించకుండా పోయిన 3 చిన్నారులు.. !

సారాంశం

కృష్ణా జిల్లాలో ఓ ఘటన కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ఒకేసారి అదృశ్యం అవ్వడం సర్వత్రా భయాందోళనలకు కారణమయ్యింది.  

కృష్ణా జిల్లాలో ఓ ఘటన కలకలం రేపింది. ఇంటిముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ఒకేసారి అదృశ్యం అవ్వడం సర్వత్రా భయాందోళనలకు కారణమయ్యింది.

కృష్ణా జిల్లా,  ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని సగర్ల పేటకు చెందిన ముగ్గురు చిన్నారులు మాయమయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిముందు ఆడుకుంటున్న ఖగ్గ శశాంక్ (11), ఖగ్గ చంద్రిక (9), కోట జగదీష్(8)లు కనిపించడం లేదు.

వీరు కనిపించకపోయేసరికి వారి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ, నూజివీడు పరిసర ప్రాంతాల్లో, రహదారుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu