గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని సమాచారం. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని నిందితులు దాడులు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
also read:తాడేపల్లి గ్యాంగ్‌రేప్.. అదే ప్రాంతంలో ఇటీవల ఐదు నేరాలు, నిందితుల్ని వదిలిపెట్టం: సుచరిత
బాధితుల నుండి దోచుకొన్న సొమ్ముతో గంజాయి కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు నిందితులను గుర్తించిందని సమాచారం.నాలుగు రోజుల క్రితం ప్రియుడితో పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన యువతిపై నిందితులు అత్యాచారం చేశారు. ప్రియుడిని కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితుల నుండి దోచుకొన్న సెల్‌ఫోన్లను దాస్ అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టారని పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ రేప్ జరగడానికి నాలుగు రోజుల ముందు ఇదే ప్రాంతంలో ఈ ఇద్దరిని పోలీసులు చూశారు. వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించి వదిలిపెట్టారు. నాలుగు రోజుల తర్వాత నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారనే అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఇద్దరికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటన జరిగిన సమయంలో నిందితులుగా అనుమానిస్తున్నవారు అదే ప్రాంతంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వారు ఉఫయోగించిన సెల్‌ఫోన్లను డేటాను కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.