ధవళేశ్వరం బ్యారేజీకిఇవాళ సాయంత్రానాకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద ఇవాళ సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
అమరావతి: గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గోదావరి నదికి గురువారం నాడు సాయంత్రానికి Dowleswaram వద్ద భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ధవళేశ్వరానికి ఎగువన Telangana లోని Bhadrachalamవద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
భద్రాచలానికి గోదావరి వద్ద సుమారు 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరద నీరంతా దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీకి చేరనుంది. భద్రాచలానికి దిగువన ఉన్నపోలవరం ప్రాజెక్టు వద్ద నీటితో పాటు దిగువన కురిసిన వర్షం నీటితో కలుపుకొని భారీగా వరద నీరు సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకొనే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీకి ప్రస్తుతం 15.52 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. 17 లక్షల క్యూసెక్కుల వరద ధవళేశ్వారానికి చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి సాయంత్రానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద పోటెత్తడంతో ముందు జాగ్రత్తగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3, ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలను ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
also read:భారీ వర్షాలు: మంచిర్యాలలో నీట మునిగిన కాలనీలు, నిలిచిన రాకపోకలు
గత 100 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గోదావరికి వరద వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో 100 ఏళ్ల క్రితం వరద వచ్చింది. ఈ దఫా జూలై మాసంలోనే పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఈ వరద నీరు కూడా గోదావరి నదిలో కలిసే అవకాశం ఉంది. దీంతో గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు ద్వారా సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు చెందిన సుమారు 48 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. గోదావరికి వరద పోటెత్తడంతో ఏపీలో విలీనమైన మండలాలతో పాటు లంక గ్రామాలు నీటిలో మునిగాయి. నీట మునిగిన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. కొందరు మాత్రం తాము తమ గ్రామాల్లోనే ఉంటామని చెబుతున్నారు. అయితే గోదావరికి వరద మరింత పెరిగే అవకశం ఉందని చెబుతూ వదర బాధిత ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు అధికారులు.