గెలుపు పై ఫిరాయింపులకు న‌మ్మ‌కం లేదా...?

First Published Aug 7, 2017, 12:50 PM IST
Highlights
  • తక్షణం ఫిరాయింపుల చేసిన ఎమ్మేల్యేలు రాజీనామా చేయించాలి.
  • ఎన్నికలు అనగానే శిలాఫలకాలు వేస్తున్నారని ఎద్దేవా.
  • టిడిపికి ఓటమీ తప్పదన్నా పెద్ది రెడ్డి.

ఎన్నిక‌లు అన‌గానే టిడిపి ప్ర‌భుత్వం అభివృద్ది మంత్రం జ‌పిస్తోందని వైసీపి ఎమ్మేల్యే పెద్ది రెడ్డి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డ్డారు. సోమ‌వారం నంద్యాల్లో ఆయ‌న మీడియా తో మాట్లాడారు. మూడు సంవ‌త్స‌రాల పాటు టిడిపి ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు ఏమాత్రం గుర్తుకు రాలేద‌ని ఆయ‌న ధ్య‌జ‌మెత్తారు. నంద్యాల ఎన్నిక‌లు అన‌గానే ఆగ‌మేఘాల మీద శిలాఫ‌లాక‌లు వేసి అభివృద్ది చేస్తున్నాం అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

త‌మ పార్టీలోకి వ‌చ్చిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామా చేసి వైసీపిలోకి వ‌చ్చార‌ని, వైసీపి నుండి ఫిరాయించి 20 మంది ఎమ్మేల్యేలు ఎందుకు రాజీనామా చేయ్య‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే ఆ 20 మంది ఎమ్మేల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు చేసిన వారి స్థానాల‌కు రాజీనామా చేయించిన త‌రువాత తిరిగి ఎన్నీక‌లు వెళ్దాం ర‌మ్మ‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. త‌మ‌ పార్టీ ఎమ్మేల్యేల‌ను డ‌బ్బు ద్వారా కోనుగోలు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అందుకు నంద్యాల‌ ప్ర‌జ‌లే బాబుకు బుద్ది చెబుతార‌ని పెర్కోన్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న రాగానే చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్ట‌డానికి ప్ర‌ణాళిక‌లు ప్రారంభించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అందుకు టిడిపి బ‌ల‌గం అంతా నంద్యాల్లో తిష్ట వేశారని ఆయ‌న పెర్కోన్నారు. 

click me!