వలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వీరు చాలా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని అన్నారు. ఆ సమాచారం అంతా ఎక్కడికి పోతోందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవస్థ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాకరమైనదని ఆరోపించారు. వారికి రూ.5 వేల జీతమిచ్చి, ప్రతీ ఇంట్లోకి దూరేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విమర్శించారు. ప్రతీ ఇంటి సున్నితమైన సమాచారం వారికి తెలుసని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఎదైనప్పటికీ.. ఇలాంటి సున్నితమైన సమాచారం బయటకు వెళ్తే చాలా ప్రమాదం అని అన్నారు.
ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది.. ఢిల్లీకి పొంచి ఉన్న వరద ముప్పు
ఏపీ ప్రజలందరూ ఈ వ్యవస్థపై పట్ల జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, కానీ వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తే ఉపేక్షించకూడదని అన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడకూదని తెలిపారు. రేషన్ పంపిణీ కోసం సీఎం జగన్ మొబైల్ డిపోల వ్యవస్థను తీసుకువచ్చారని జనసేన అధినేత అన్నారు. కానీ దానిని ఎప్పుడైన సీఎం పరిశీలించారా అని ఆయన ప్రశ్నించారు.
ఆడ పిల్లలు ఉన్న పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు. పిల్లలు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. ఒంటరిగా ఉంటున్న మహిళలు, వితంతువులకు భద్రత ఉందా లేదా అనే విషయాన్ని జనసేన వీర మహిళలు గమనిస్తూ ఉండాలని కోరారు. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే దీనిని ప్రారంభిద్ధామని ఆయన తన కార్యకర్తలకు సూచించారు. వలంటీర్లు ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రతీ రాజకీయ మద్దతుదారుడు గమనించాలని కోరారు. అలాగే మహిళల సెఫ్టీని కూడా చూడాలని తెలిపారు.
స్పా ముసుగులో వ్యభిచారం.. విటులలో ప్రముఖుల సుపుత్రులు.. నిర్వాహకుడితో సహా అందరి అరెస్టు
వలంటీర్లకు కేవలం అవసరమైన సమాచారమే ఇవ్వాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. ఈ వలంటీర్ వ్యవస్థ ప్రజలను కంట్రోల్ చేయడానికే జగన్ రూపొందించారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థను సరిగా గమనించకపోతే, భవిష్యత్తులో ఇది ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలా మారుతుందేమో అని ఆయన తెలిపారు. గతంలో పులివెందుల సరస్వతి నిలయంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఫ్యాక్షన్ నిలయంగా మార్చారని పవన్ కల్యాన్ ఆరోపించారు. తిరిగి దానిని సరస్వతి నిలయంగా మరుద్దామని తన మద్దతుదారులతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్సీబీఆర్ లెక్కలు చెబుతున్నాయని పవన్ కల్యాన్ అన్నారు. కానీ అందులో కేవలం సగం మంది మహిళలే ఇంటికి వచ్చారని, మిగితా వారందరూ ఏమయ్యారని జనసేన అధినేత ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. వలంటీర్ల వ్యవస్థలో మహిళలు తక్కువ మందే పని చేస్తున్నారని తెలుస్తోందని అన్నారు.
ఈ వ్యవస్థ ప్రతీ ఇంటికి తిరుగుతోందని, సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందని పవన్ కల్యాన్ ఆరోపించారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుందో ? ఏమైపోతుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను వలంటీర్లందరినీ తప్పు బట్టడం లేదని అన్నారు. ఇప్పటికే అనేక వ్యవస్థలు ఉన్నాయని, మరి ఈ కొత్త వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు కాదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. మరి వీరు సేకరించిన సమాచారం అంతా ఏమవుతోందని అన్నారు.