ప్రకాశం జిల్లాలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, ఏడుగురు మృతి

Published : Jul 11, 2023, 06:33 AM IST
ప్రకాశం జిల్లాలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, ఏడుగురు మృతి

సారాంశం

ప్రకాశంజిల్లా దర్శిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ కెనాల్ లోకి పెళ్లి బస్సు దూసుకెళ్లడంతో 7గురు మృతి చెందారు. 15మందికి పైగా గాయపడ్డారు. 

ప్రకాశం :  ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  సాగర్ కెనాల్ లోకి పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 గురు మృతి చెందారు. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 

మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. చిన్నారి మృతదేహం బస్సు కింద ఇరుక్కుపోయింది. బస్సును సాగర్ కాలువ లోంచి బస్సు బయటకి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెళ్లి అయిన తరువాత మిగతా కార్యక్రమాల కోసం పెళ్లి బృందం పొదిలి నుంచి కాకినాడకు వెడుతోందని సమాచారం.

విద్యార్థుల ముసుగులో గంజాయి దందా... తాడేపల్లిలో నలుగురు స్మగ్లర్ల అరెస్ట్ (వీడియో)

మృతులు అబ్దుల్ అజీజ్ (65) అబ్దుల్ హనీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా(6)లుగా గుర్తించారు. అతివేగంతో బస్సు వస్తుండగా..కాలువ సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి.. సైడ్ వాల్ కు తగలడం వల్ల కంట్రోల్ అవ్వక కాలువలోకి దూసుకుపోయింది. 

ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ మాట్లాడుతూ.. ‘ముందు బస్సు వాల్ కు కొట్టుకోవడంతో బస్సులోని ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఆ తరువాత బస్సు కాలువలోకి దూసుకెళ్లే క్రమంలో..బస్సుకింద క్రష్ అయి 7గురు మృతి చెందారు. మాకు సమాచారం అందగానే హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. దీనివల్ల చాలామందిని రక్షించగలిగాం. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేద’ని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!