స్పా ముసుగులో వ్యభిచారం.. విటులలో ప్రముఖుల సుపుత్రులు.. నిర్వాహకుడితో సహా అందరి అరెస్టు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న పీస్ రెయిన్ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పోలీసులు దాడి జరిపారు. నిర్వాహకుడు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బయట చూస్తేనేమో స్పా సెంటర్ బోర్డు.. కానీ లోపల జరిగేదేమో వ్యభిచారం. ఇలాంటి సెంటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై సమాచారం అందిన వెంటనే దాడి చేసి, నిందితులను అరెస్టు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ని బంజారా హిల్స్ లోని ఇలాంటి స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులను, విటులను అరెస్టు చేశారు.
ఇళ్లలో పాచి పని చేస్తూ భర్తను చదివించిన భార్య.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మరో యువతితో కలిసి ఉంటూ..
బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లోని ఉన్న ఓ స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వాహిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే దానిపై దాడి చేశారు. ఈ సెంటర్ ను నడిపిస్తున్న వ్యక్తితో పాటు నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విటులంతా హైదరాబాద్ లోని ప్రముఖుల కుమారులని తేలినట్టు ‘సాక్షి’ నివేదించింది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సహ నిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్ తో పాటు విటులైన ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లు ఉన్నా1రు. అయితే ఓ ఐదుగురు యువతులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇలా వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం. వీరిని అధికారులు రెస్క్యూ హోంకు తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.